'ధూమపాన ప్రేమ'లో భారతీయ యువతులు

యువ 
 
స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకీ, విచ్చల విడితనానికి మధ్యలో సన్నటి పొర వుంది. ఆ వ్యత్యాసం గమనించలేక సమకాలీన యువత 'విమెన్స్‌ లిబ్‌' పేరిట, 'ఎంపవరింగ్‌ విమెన్‌' సాకుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తు న్నారని విజ్ఞుల, సామాజిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. ఒకవైపు పాశ్చాత్య దేశాల యువత కూడా, భారతీయ సంస్కృతి, సంప్రదా యాల మీద గౌరవం పెంచుకుం టున్న తరుణంలో, భారతీయ మహిళలూ, యువతులూ పాశ్చా త్య నాగరికత మీద మోజు చూపడం విచారకరమని అనుభ వజ్ఞులు వాపోతున్నారు.
యవ్వన దశలో చలాకీగా, సరదాగా వుం డడం, వుల్లాసంగా జీవితం గడపడం వాంఛ నీయమే. కానీ, ఆ విలాసాల పరిధులు దాటి శారీరక వాంఛలకి పవిత్రమైన ప్రేమ అనే పేరు పెట్టి, 'సోషల్‌ మూవ్‌మెంట్‌' అంటే, కలివి డితనం పేరుతో క్లబ్స్‌లో, పబ్స్‌లో మధ్య పానాల మత్తులో, అమూల్యమైన శీలసంపదని కోల్పోయి, చివరికి చేసేది లేక, దిక్కుదారి తోచక, విలవిలలాడే యువతులని చూసి జాలి పడాలా? లేదా, 'చేసుకున్న వాళ్లకి చేసుకు న్నంత' అనే మెట్ట వేదాంతంతో వాళ్లను అలా పతితులుగా, భ్రష్టులుగా గాలికి వదిలేయాలా?
అసలు, ఈ చెడు అలవాట్లు, ధూమ పానంతో మొదలవుతాయి. భారతీయ వాతా వరణంలో, పురుషలకీ, వయోజనులకి కూడా, ధూమపానం ఆరోగ్యరీత్యా సరిపడని విష యం. అయినా, ఉత్తరాంధ్రలో, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలలో మహిళలు చుట్టలు కాల్చడమే కాక, 'అడ్డపొగ' అంటే కాలుతున్న చుట్ట భాగాన్ని నోటిలో పెట్టుకోవ డం, అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ఆ అలవాటు వల్ల వాళ్ళకి నోటి కేన్సర్‌ రావడం కూడా సర్వసాధారణంగా జరుగుతున్న విష యమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య శాఖలు కూడా వాళ్లచేత ఆ అలవాటు మాన్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అలాంటి పరిస్థితులలో,దేశంలోని యువ తరం, ముఖ్యంగా యువతులు 'ధూమపాన ప్రేమికులు' కావడం శోచనీయం. అయితే, తమ మానసిక ఒత్తిడులనీ, ఒంటరితనాన్నీ, విసుగునీ, బద్ధకాన్నీ నివారించుకోవడానికి ధూమపానమే తరుణోపాయమని యువతుల వాదన.ముఖ్యంగా బిపివోలలో రాత్రిళ్లు కూడా పనిచేసే యువతులూ, మీడియా వృత్తి చేపట్టిన తరుణులూ ధూమపానానికి ఎక్కువగా అల వాటు పడుతున్నారనీ, వెయ్యి మంది యువ తులలో, కనీసం 150 మంది ధూమ పాన ప్రేమికులేననీ, కొందరు జాబ్‌ స్టేటస్‌ కోసం, మరికొందరు ఫ్యాషన్‌ కోసం, ఇంకొందరు చెడు స్నేహాలతో యిలా ధూమపానానికి బాని సలవుతున్నారనీ ఇటీవల జరిపిన ఒక పరిశోధ నలో తేలింది.
Category: 0 comments

No comments:

Pages