Posted by
dinesh
ముంబై: ముంబైలో తృటిలో ఘోర విమానప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఒకే రన్  వేపై రెండు విమానాలు దిగడానికి ఇవ్వడంతో సంఘటన చోటుచేసుకుంది. వివరాలలోనికి  వెలితే..ముంబై విమానాశ్రయంలో ఢిల్లీ నుండి ముంబాయ్ చేరుకొన్నకింగ్  ఫిషర్‌కు చెందిన విమానం రన్ వేపై ల్యాండ్ అవబోతుండగా అక్కడ అప్పటికే  ముంబాయ్ నుండి చెన్నై వేళ్ళాల్సిన స్పైస్ జెట్ కు చెందిన మరో విమానం  ఉన్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెచ్చరించడంతో కింగ్‌ఫిషర్ కు  చెందిన విమాన పైలెట్ అప్రమత్తమయ్యాడు. దీంతో పైలెట్ టేకాఫ్ తీసుకుని మరో  రన్ వేపై దిగటంతో అందులోనున్న 400 మంది ప్రయాణీకులు సురక్షితంగా  బయటపడ్డారు. ఇదిలావుండగా ఒకే రన్ వేపై ముందుగావున్న విమానం స్థానంలోనే మరో  విమానాన్ని ల్యాండ్ అయ్యేందుకు అనుమతినివ్వడంపై తాము దర్యాప్తు  చేపట్టినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు.
Category: 
0
comments
No comments:
Post a Comment