ఏడు ఒప్పందాలపై భారత్‌- శ్రీలంక సంతకాలు

  national
న్యూఢిల్లి: కీలకమైన భద్రత, విద్యుత్‌తోసహా ఏడు ఒప్పందాలపై బుధవారం భారత్‌, శ్రీలంక దేశాలు బుధవారం సంతకాలు చేశాయి. నివాసాలను కోల్పోయి సహాయ శిబిరాలలో ఉంటున్న తమిళులకు సత్వరమే పునరావాస ఏర్పాటునకు సంబంధించి, శ్రీలంక జాతుల సమస్యకు రాజకీయ పరిష్కారం సాధించే అంశంపైనా భారత దేశానికి ఈ సందర్భంగా శ్రీలంక హామీ ఇచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజ్‌పక్సాతో పలు అంశాలపై విస్తృత స్థాయిలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రతినిధుల స్తాయి సమావేశం నిర్వహించారు. నిరాశ్రయులైన తమిళుల దుస్థితిపట్ల భారత దేశం చెందుతున్న ఆందోళనను రాజ్‌పక్సా దృష్టికి ప్రధాని తీసుకెళ్ళారు. శ్రీలంకలో తమిళుల సమస్యను రాజకీయంగా పరిష్కారించాలని మన్మోహ న్‌సింగ్‌ రాజ్‌పక్సాను గట్టిగా కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంబంధాలు పెంపొందించుకోవడం, ఇంధన భద్రత, అభివృద్ధి, ఉగ్రవాద వ్యతిరేక రంగాలతో సహా పలు ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ఉభయ నాయకులూ విస్తృత పరిధిలో చర్చలు జరిపారు.
ఇప్పటికీ సహాయ శిబిరాలలోనే కాలంగడుపుతున్న నిరాశ్రయులైన తమిళులకు వేగగంగా పునరావాసం కల్పించే అంశంపై రాజ్‌పక్సా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మరోసారి హామీ ఇచ్చారు. అధికారాల కల్పన చుట్టూ పరిభ్రమిస్తున్న శ్రీలంక జాతుల సంఘర్షణకు రాజకీయ పరిష్కారం సాధనలో ఏకాభిప్రాయానికై ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రాజ్‌పక్సా వివరించారని అధికార వర్గాలు తెలిపాయి. ఉభయ నాయకుల సమావేశా నంతరం పలు రంగాలలో ఉభయదేశాల మధ్యా ద్వైపా క్షిక సహకారానికి ఊపునిచ్చే ఏడు ఒప్పందాలపై సంత కాలు జరిగాయి. ఈ ఒప్పందాలలో భద్రత, ఇంధనం, రైల్వేలు, సాంస్కృతిక మార్పిడి మొదలయినవి ఉన్నాయి.
ఉభయదేశాల విద్యుత్‌ గ్రిడ్‌ల అనుసంధానం
తీవ్రమైన విద్యుత్‌ కొరతతో సతమతమవుతున్న శ్రీలంకలో విద్యుత్‌ సరఫరా మెరుగుపడేందుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌సరఫరాకోసం రెండు దేశాల విద్యుత్‌ గ్రిడ్‌లను అనుసంధానపరిచేందుకు ఉద్దేశించిన అవగాహనా పత్రం(ఎంఒయు) పై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. దీర్ఘకాలంపాటు అంతర్యుద్ధంలో నలిగిపోయిన శ్రీలంకలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల రంగం బాగా దెబ్బతినడంతో ఆ దేశానికి విద్యుత్‌ను సరఫరాచేసే విషయంలో సాధ్యాసా ధ్యాలను అధ్యయనం చేసేందుకు ఈ ఒప్పందం వీలుకల్పిస్తుంది. ఉభయదేశాల విద్యుత్‌ గ్రిడ్‌లను కలిపేందుకు డీప్‌ సీ (లోతయిన సముద్ర) కేబుళ్ళను ఉపయోగించాల్సి వుంటుంది.
ఉభయదేశాల మధ్యా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహాకారం అందించుకునేం దుకు దోహదపడే నేర వ్యవహారాలపై పరస్పర న్యాయ సహకారం, శిక్షపడిన వారిని పరస్పరం బదిలీ చేసుకోవడంపై రెండు ఒప్పందాలు చేసుకున్నారు. తలైమన్నార్‌-మధు రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన ఒప్పందంపైకూడా సంతకాలు చేశారు. నాలుగురోజుల అధికారిక పర్యటనపై రాజ్‌పక్సా మంగళవారం ఢిల్లిd చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడుగా జనవరిలో తిరిగి ఎన్నికైన తరువాత రాజ్‌పక్సా భారత్‌పర్యటనకు విచ్చేయడం ఇదేప్రథమం.
Category: 0 comments

No comments:

Pages