జేమ్స్‌బాండ్ గూఢచారి చిత్రాలు చూసే వారికి ఆధునిక సాంకేతిక ఉపకరణాల  సాయంతో శత్రువుల ఉనికిని గుర్తించడం ఎలానో తెలిసే ఉంటుంది. ఇదే రకమైన  ఆధునిక మైక్రో(సూక్ష్మ) ఉపకరణాలను వినియోగించేందుకు ఆర్మీ ప్రణాళికను  సిద్దం చేస్తోంది. ఈ ఉపకరణాల సాయంతో ఉగ్రవాదుల స్థావరాలు, సమావేశ స్థలాలు  కదలికలు తదితర వివరాలను తెలుసుకునే యత్నానికి సన్నాహాలు చేస్తోంది. రక్షణ  మంత్రిత్వశాఖ ఇటీవల రూపొందించిన 'టెక్నాలజీ పర్‌స్పెక్టివ్-కేపబులిటీ  రోడ్‌మ్యాప్'లో నానోటెక్నాలజీ ఉత్పత్తుల వినియోగ అవకాశాలపై సైన్యం  వివరించింది. చివరకు క్షేత్రస్థాయిలో పని చేసే ఉగ్రవాదులు, సానుభూతిపరులు  సమావేశమయే స్థలంలో ఈ మైక్రో ఆడియో-వీడియో ఉపకరణాలను అమర్చడం సాధ్యమవుతుందని  సైన్యం తెలిపింది. పరిమాణంలో చిన్నవిగా ఉండటమేకాక వినియోగ వ్యయం తక్కువగా  ఉంటుందన్నారు. ఉపకరణాలు తేలికగా అధిక సామర్ధ్యంతో పని చేస్తాయన్నారు. పైగా  వీటిని అమర్చిన ప్రదేశాన్ని గుర్తించడమూ కష్టమేనని సైనికాధికారులు  తెలిపారు. కాగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకించిన  ప్రదేశాల్లో సూక్ష్మ పరిమాణంలో ఉండే వాయు, ఉపరితల ఉపకరణాలను  అమర్చవచ్చన్నారు. సెన్సర్‌లు గుర్తించలేని సూక్ష్మ స్థాయి ఇందన ఉపకరణాలను  ఉపయోగించేందుకు సైన్యం సన్నాహాలు జరుపుతోంది
No comments:
Post a Comment