వాస్తులో సైన్స్‌ ఎంత?-1

  • విశ్వాసాలు.. వాస్తవాలు... 
''కాంతారావు! నువ్వు వాస్తును అకారణంగా వ్యతిరేకిస్తున్నావు! వాస్తులో సైన్సు ఎంతో ఉంది. ఉదాహరణకు ఏ ఇంటికైనా ఎండ, గాలి ఎలా ఉండాలో మొదలైన అనేక విషయాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. వాటిని కూడా నువ్వు కాదనగలవా?' ప్రశ్నించాడు నా మిత్రుడు సుబ్బారావు.
''సుబ్బారావూ! వాస్తు శాస్త్రంలో ఏమేరకైనా సైన్సు విషయాలున్నట్లు రుజువు చేస్తే వాటిని తప్పకుండా మేము అంగీకరిస్తాము. కాని వాస్తు శాస్త్రంగా చెప్పబడే విషయాలలో సైన్సుకు విరుద్ధమైనవే ఎక్కువగా ఉంటున్నాయి'' అన్నాను నేను.
''అదెలాగ?'' ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.
''ఉదాహరణకు విశ్వకర్మ వాస్తు సంగ్రహంలోని ఈ కింది శ్లోకపాదం ఉంది చదువు. 'ఏకదిశి బహిర్ద్వారం మహదైశ్వర్య కారణం' అంటే 'గృహానికి ఒకే ద్వారముంటే మహదైశ్వర్యం లభిస్తుంది' అని అర్థం. దానినే శ్రీకృష్ణ వాస్తులో కూడా సమర్థించారు. 'సౌఖ్య మొదవును ద్వారమేకాఖ్యక్షితిని''. అంటే 'గృహమునకు ఏకద్వారమున్నచో సౌఖ్యము' అని అర్థము. గృహమునకు ఒకే ద్వారముంటే ఏమవుతుంది? ఇంట్లోకి ఎండా, గాలి సరిగా ప్రసరించవు. దానివలన అనారోగ్యం, అనేక రోగాలు వస్తాయిగానీ ఆరోగ్యం పెరుగుతుందా? ఇక ఆ ఇంట్లో వాళ్ళకు సౌఖ్యం ఎలా కల్గుతుంది? ఇక రెండోద్వారం కూడా పెట్టుకోలేని వాళ్ళు ఎవరు? చుట్టు గుడిసెలలో ఉండే కటిక పేదవారు కదా? వారికి మహదైశ్వర్యాలు కలుగుతాయని చెప్పడం వారిని క్రూరంగా పరిహసించడం కాదా? కాబట్టి ఇంటికి ఒకే ద్వారం ఉండాలనడం సైన్సుకు, గాలి, వెలుతురుకు సంబంధించి సూత్రాలకూ విరుద్ధం కాదా?''
''విరుద్ధమే?'' గొణిగాడు సుబ్బారావు.
కె.ఎల్‌.కాంతారావు జన విజ్ఞాన వేదిక.
Category: 0 comments

No comments:

Pages