చిత్తూరు : ప్రశాంతంగా ఉండే చిత్తూరు  జిల్లాలో ఐఎస్‌ఐ ఉగ్రవాది సంచరిస్తున్నట్లు అనుమానంతో కర్నాటక పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు. వేలూరులోని ఓ నెట్ సెంటర్ ద్వారా అహ్మద్ అనే  వ్యక్తి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన కర్నాటక పోలీసులు అతని  ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు.
వారం రోజుల క్రితం అహ్మద్  స్థానిక ఇంటర్ నెట్ కేఫ్ నుంచి మియిల్ ఐడీ సృష్టించుకుని ఐఎస్‌ఐకు  ఈమియిల్ పంపినట్లు తెలుస్తోంది. నెట్ సెంటర్ యజమాని పరారీలో ఉండగా,  చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం ఉగ్రవాది సంచారంపై తమ వద్ద ఎలాంటి సమాచారం  లేదని చెబుతున్నారు.
No comments:
Post a Comment