నా గత చిత్రం సరిగ్గా ఆడకపోవడంవల్ల కథల ఎంపిక విషయంలో జాగ్రత్త  తీసుకుంటున్నాను అంటున్నారు హీరో సుమంత్. సుమంత్ హీరోగా కుమార్ బ్రదర్స్  నిర్మించే చిత్రం ఓపినింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.  విజి శిపివిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో  ఆరంభమైంది. డి.రామానాయుడు దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. తొలి  దృశ్యానికి శ్రీ మిత్ర చౌదరి కెమెరా స్విచాన్ చేయగా, అక్కినేని నాగార్జున  క్లాప్ ఇచ్చారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా విమలారామన్ చేస్తోంది. జూన్,  జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తి  చేసి  దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ కొత్త చిత్ర విశేషాలు చెబుతూ  సుమంత్...నిమిది నెలల క్రితం ఈ కథ ఓకే చేశాను. కథ చాలా కొత్తగా ఉంది.  మొదటిసారి ట్రయాంగిల్ రొమాంటిక్ స్టోరీ చేస్తున్నాను అన్నారు ఇదొక  ట్రెండీ లవ్‌స్టోరీ. కామెడీ, యాక్షన్, రొమాన్స్..ఇలా అన్నీ ఉంటాయి. నా  అన్ని సినిమాల్లోనూ హీరోయిన్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ఈ చిత్రంలో కూడా  అలానే ఉంటుంది' అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో అతిథిగా పాల్గొన్న  ప్రియమణి  మాట్లాడుతూ..."ఈ బేనర్‌లో నేను 'సాధ్యం' సినిమా చేశాను. మంచి  సినిమాలు అందించాలనే తపన ఉన్న నిర్మాతలు వీరు. ఈ చిత్రం విజయం సాధించాలని  కోరుకుంటున్నాను' అంది. ఇక సుమంత్ ప్రస్తుతం అష్టా చెమ్మ ఫేమ్ ఇంద్రగంటి  మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది ఆగస్ట్‌లో విడుదల  అవుతుంది.
No comments:
Post a Comment