ఇస్లామాబాద్ : పొరుగుదేశంగా భారత్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నారు. కాశ్మీర్ అంశంతో సహా ఇరుదేశాల మధ్య అన్ని అంశాలపై శాంతియుత పరిష్కారం మార్గంకోసం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. అమెరికా ప్రత్యేక ప్రతినిధి హోల్‌బ్రూక్‌తో సమావేశంలో గిలాని పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని తాము ఆతృతగా ఉన్నామని చెప్పారు. పాక్, భారత్‌ల మధ్య చర్చల పునరుద్ధరణను తాము స్వాగతిస్తున్నామని బ్రూక్ తెలియజేస్తూ... ఇరు దేశాల మధ్య జరగబోయే చర్చల కోసం అమెరికా ఎదురుచూస్తోందని అన్నారు.
No comments:
Post a Comment