జాకీ ష్రాఫ్ తో జూ ఎన్టీఆర్ ఫైటింగ్

ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రం షూటింగ్ ఈజిప్టులో జరుగబోతోంది. ఈ నెల 22 నుంచి 30 వరకూ ఈ షూటింగ్ జరుగుతుంది. అలాగే జాకీ ష్రాఫ్ కీ ఎన్టీఆర్ మధ్య కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమచారం. ఈ సీన్స్ ని జాకీ ష్రాఫ్, పూజా బేడీ, సోనూ సూద్‌ లతో పాటు 25 మంది ఫారిన్ ఆర్టిస్టులతో చిత్రీకరించడం జరుగుతుంది. తదనంతరం జూలై 10 నుంచి ఎన్టీఆర్, ఇలియానాతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని సన్నివేశాలను లడక్, శ్రీనగర్, కాశ్మీర్, హరిద్వార్ ‌లో ఆగస్ట్ 8 వరకూ చిత్రీకరిస్తారు.

ఈ విశేషాలను నిర్మాత అశ్వనీదత్ తెలుపుతూ...తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న కాస్ట్‌ లీయెస్ట్ సినిమా ఇది' అని అన్నారు.అలాగే ఎన్టీఆర్‌ పాత్ర, నటన శక్తిమంతంగా ఉంటాయని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ ‌రమేష్.
Category: 0 comments

No comments:

Pages