![]() |

కలెక్షన్ల చరిత్ర తిరగరాయబడే సమయం ఆసన్నమవుతోంది. బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలయ్యే రోజు దగ్గర పడుతోంది. ‘కొమరం పులి’ రాకకు రంగం సిద్దమవుతోంది. అశేషాభిమాన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆరాటంగా ఎదురుచూస్తోన్న ‘పులి’ విడుదలకు తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఎ ఆర్ రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్స్ చేసిన ‘కొమరం పులి’ ఆడియోని మరో పది రోజుల్లో(June 27) మార్కెట్ లోకి పంపి జూలై 2న సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే సరిగ్గా మరో నెల రోజుల్లో ‘కొమరం పులి’ గా మనముందుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
కళ్యాణ్, నిఖిషా పటేల్ కాంబినేషన్లో ఖుషీ ఫేమ్ దర్శకుడు ఎస్.జె.సూర్య రూపొందిస్తున్న 'పులి' చిత్రం కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రంలో శ్రియ ఓ ఐటం సాంగ్ చేస్తోంది. జల్సా రిలీజై చాలా కాలం అవటంతో ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అంతేగాక ద్విపాత్రాభినయం తొలిసారిగా చేస్తున్నారని సమాచారం. పోలీస్ డిపార్ట్ మెంట్ చుట్టూ తిరిగే ఈ కథలో నాజర్, చరణ్ రాజ్, గిరీష్ కర్నాడ్ కీలకపాత్రలు చేస్తున్నారు. వినోద్ ప్రధాన్ కెమెరా అందిస్తున్నారు.
అలాగే రీసెంట్ గా పవన్ హీరోగా జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ ప్రారంభమైంది. బొత్సా సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హాస్యనటుడు గణేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
__________________
No comments:
Post a Comment