- వివాదాలకు మిలియన్ 'డాలర్ శేష' ప్రశ్నలు
- గాయపడుతున్న భక్తుల మనోభావాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారంగా... కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీనివాసుని సన్నిధిలో వర్గ కలహాలు అంతకంతకూ రగులుకుంటున్నాయే తప్ప ఇప్పట్లో చల్లారే పరిస్థితులు అగుపించడంలేదు. సాధారణ మానవుల్లా సాక్షాత్ శ్రీవారి ప్రధాన అర్చకులు (రమణమూర్తి బృందం), స్వామి వారల సేవల కోసం నియమితులైన ప్రత్యేక సేవకులు (ధర్మారెడ్డి వర్గం)ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న స్థాయిలో వ్యక్తిగత దూషణలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలుకు కారకులైన ఇరువురు ప్రముఖులను సంప్రదించాలని ఆంధ్రప్రభ చేసిని ప్రయత్నానికి ధర్మారెడ్డి అందుబాటులోకి రాలేక పోయారు. హైదారబాద్ నుండి తిరుమలకు బయలు దేరుతున్న సమయంలో టెలిఫోన్ సంభాషణలో గత వైఖరిని యధావిధిగా ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వుటంకించారు. అయితే మాటల తూటాలు దూసుకున్న ఇరువురి వ్యక్తుల నడుమ వివాదానికి కారణ హేతువుగా డాలర్ శేషాద్రి వున్నట్లు ఆయన వెల్లడించిన మాటల ద్వారా వ్యక్తమైంది. రెండురోజుల మీడీయా ముఖంగా మాటల యుధ్దానికి తెరలేపిన ఈ ఇద్దరు శ్రీవారి సేవకులు ఇక మీదట తమ బృందాలతో, వర్గాలతో పరోక్ష ''వైరి''కి సిధ్దమౌతున్నట్లు సమాచారం. ఇటుంటి తరుణంలో ''దేవుడా నీకొండను నీవే రక్షించుకో వయ్యా'' అంటూ అసంఖ్యాకంగా తిరుమలకు చేరుకుంటున్న సాధారణ భక్తులు మూగ బాధను వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపై వివాదాలకు కారకులైన ఇరువురూ అనుక్షణం శ్రీనివాసుని సన్నిధిలో భక్తి పూర్వకమైన, నిష్కల్మషమైన మనస్సులతో వ్యవహరించాల్సిన వారే కావడం ఇక్కడి ప్రత్యేక. ఒకరు వేలాది మైళ్ళ దూరం నుండి దేశ,విదేశాల గుండా ఒక్కక్షణం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివచ్చే వారికి సహాయకులుగా వ్యవహరిస్తుండగా, మరొకరు కలియుగ ప్రత్యక్ష దైవానికి ఒక్క విశ్రాంతి సమయంలో తప్ప తక్కిన సమయమంతా వివిధ రకాల సేవలతో మమేకమౌతూ రమ పవిత్రమైన స్థానంలో వుండే వారు కావడం మరొక విశేషం. ఇరువురు వ్యక్తులూ ఇంత ప్రత్యేకమైన స్థానంలో వుంటూ కూడా సామాన్య మానవులవలే వ్యవహరించడంపై శ్రీవారి అశేష భక్తకోటి జనులు ఏహ్యా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రమైన తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో ఇటువంటి భిన్న మనస్థత్వాల వ్యక్తుల వల్ల వచ్చీ పోయే భక్తులకు, కొండంత ఆశతో తిరుమల కొండను చేరాలని ఆకాంక్షిస్తున్న సేవకులకు ఎలాంటి భావాలు వెలతాయని అంటున్నారు. తక్షణం ప్రత్యక్ష మాటల యుధ్ధానికి తెరదీసిన వ్యక్తులను, పరోక్షంగా అరోపింప బడిన కారణాలకు వెంటనే కట్టడి చేయాలని కోరుకుంటున్నారు.
టిటిడి బోర్డు ఛైర్మన్‌గా వుంటూ అనేక నూతన పథకాలకు నాందీ వాచకం పలికిన భూమన కరుణాకర రెడ్డికి మాజీ ఓఎస్‌డి, వివాదాలు ఆది భూతుడు అయిన డాలర్ శేషాద్రికి, ఇప్పటి టిటిడి ఓఎస్‌డి ధర్మారెడ్డి ఇరువరూ అత్యంత సన్నిహితులు. వీరివురూ పదవిలో వున్నన్ని రోజులు మాట మాత్రమైన ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులును కానీ మరి కొంతందిని శ్రీవారి వారి సేవకులకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా వుంచి డాలర్ శేషాద్రి చక్రం తిప్పాడు. అటువంటి వ్యక్తిని గడువు ముగిసిన కారణంతో టిటిడి నుండి బయటకు సాగనంపడంతో ప్రధాన అర్చకునికి కొంత వూపిరి వచ్చినట్లు అయింది. అంతే గాకుండా ఛైర్మన్ కూడా మారడం ఒకరకంగా కలిసి వచ్చింది.
అయితే వచ్చిన చిక్కల్లా ధర్మారెడ్డికి డాలర్ శేషాద్రికి ఉన్న సాన్నిహిత్యం రమణ మూర్తికి ఏమాత్రం నచ్చడం లేదని, తద్వారా శేషాద్రే తమపై వుసిగొలిపి ఓఎస్‌డి ద్వారా తమకు ఆంక్షలు విధించే ప్రయత్నానికి పూనుకున్నట్లు ప్రధాన అర్చకుని వాదనగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కమిటీ ఛైర్మన్‌గా భూమన నిష్క్రమించినా ఒక సాధారణ అదికారి అయిన ధర్మారెడ్డి తమపై పెత్తనం చెలాయించటం ఏమిటని వీరు ప్రశ్నించుకుంటున్నారు. వందల సంవత్సరాలుగా వంశపారంపర్య సేవల హక్కు కలిగిన మాపైనే ఒక అధికారి ధిక్కార ధోరణిని వీరు ఏమాత్రం జీర్ణించుకోలేక శ్రీవారి ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు.
కొసమెరుపు ఃొ భిన్న మనస్తత్వాలు, సాధారణ కోపావేశాలు కలిగిన వ్యక్తులను కొండనుండి సాగనంపి కోట్లాది మంది భక్తుల స్వఛ్ఛమైన కొంగుబంగారమైన శ్రీనివాసునికి మచ్చ లేకుండా చూడాలని సాధారణ భక్త కోటి వేడుకుంటున్నది.
No comments:
Post a Comment