అమ్మ పాత్రలో మనీషా |
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ఓ మలయాళ చిత్రంలో నయనతారకు అమ్మగా నటిస్తు న్నారు. తమిళంలో ఆమె హిట్ చిత్రాలైన 'ఇండియన్, 'మొదల్ వన్, 'బొంబాయిలలో నటించారు. చివరిగా ఆమె 2005లో విడుదలైన 'ముంబాయి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించారు. చాలా కాలం విరామం అనంతరం తమిళ చిత్రం 'మాపిళ్లై రీమేక్‌లో ధనుష్‌కు అత్త పాత్రలో నటిస్తున్నారు. 'ఎలక్ట్రా అనే మలయాళ చిత్రంలో నయనతారకు అమ్మగా ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి మనీషాకోయిరాలా మాట్లాడుతూ తనకు త్వరలో వివాహం జరగనుందని అన్నారు. పెళ్లి తరువాత నటనను కొనసాగిస్తానని తెలిపారు. మంచి కథాంశం కలిగిన చిత్రాలను మా త్రమే ఎంపిక చేసుకొని నటిస్తానని చెప్పారు. మలయాళంలో ఎలక్ట్రా చిత్రంలో నయనతారకు అమ్మగా నటించడంపై విమర్శలు వచ్చాయని తెలిపారు. 'మాప్పిళ్లై చిత్రంలో ధనుష్‌కు అత్తగా నటించడం మరువలేని అను భవమని అన్నారు. లేడీ విలన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు |
5
Jun
2010
Posted by
dinesh
Category:
0
comments
No comments:
Post a Comment